Header Banner

తిరుమలలో నమాజ్ చేసిన ముస్లిం! ఆరా తీస్తోన్న టీటీడీ..!

  Fri May 23, 2025 09:22        Others

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. మంగళవారం నాడు 80,964 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,125 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా సాగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలలో వెలిసిన జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను స‌మ‌ర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొలుత- ఆలయం వద్దకు చేరుకున్న ఛైర్మన్ కు అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం పలికారు. జాపాలి ఆంజనేయస్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేకం పూజలు నిర్వహించిన అనంతరం సింధూర వస్త్రంతో ఆయనను సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుమల శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో, మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద టీటీడీ ఛైర్మన్ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఉదయం అభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం విగ్ర‌హం వ‌ద్ద‌ వేద మంత్రోచ్చారణలు, మేళ‌తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అస్థానం వేడుకగా నిర్వహించారు. ఒకవంక హనుమజ్జయంతి వేడుకలు సాగుతున్న పరిస్థితుల్లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు తిరుమలలో నమాజ్ చేయడం కనిపించింది. తిరుమలలో గల కళ్యాణ మండపం ప్రాంగణానికి సమీపంలో ఆ వ్యక్తి హజ్రత్ టోపీ ధరించి నమాజ్ చేయడానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనతో అక్కడ కలకలం చెలరేగింది. ఆ వ్యక్తి 10 నిమిషాలకు పైగా తిరుమల కల్యాణమండపం సమీపంలో నమాజ్ చేశాడని, ఇది చూసిన చాలామంది శ్రీవారి భక్తులు దిగ్భ్రాంతికి గురి అయ్యారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ న్యూస్ 18 ఇంగ్లీష్ వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను న్యూస్ 18 యాంకర్ రాహుల్ శివశంకర్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ బృందం సీసీటీవీ ఫుటేజ్, కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Tirumala #TTDProbe #NamazInTirumala #TTDInvestigation #ReligiousControversy #TirumalaTemple